యేసునాధుని యోధులందరు వాసిగ నిటరండు వేగమె వాసిగ నిటరండు
భాసురముగ ప్రభు జన్మము బాడుచు నాసతోడ రండు వేగమె
యాసతోడ రండు ||జే జయం||
1. దూతలమాదిరి గాత్రము లెత్తుచు గీతము బాడుండి వేగము గీతము
బాడుండి దాతయౌ మన క్రీస్తుని నీతిని ఖ్యాతిగ బలుకుండి వేగమె
ఖ్యాతిగ బలుకుండి ||జే జయం||
2. గొల్లల ప్రభు కడకేగిన రీతిని నెల్లరు నడువుండి వేగమె యెల్లరు
నడువుండి ఉల్లములందున సంతసించి ప్రభు నెల్లెడ దెలుపుండి వేగమె
యెల్లడ దెలుపుండి ||జే జయం||
3. జ్ఞానుల భంగిని మానవులందరు కానుక లియ్యుండి వేగమె కానుక
లియ్యుండి మానవకోటికి రక్షణ భాగ్యము దానము బొందుండి వేగమె
దానము బొందుండి ||జే జయం||
4. మరియ రీతిగను మనసు లోపలను మురియుచు నుండుండి వేగమె
కానుక లియ్యుండి మానవకోటికి రక్షణ భాగ్యము దానము బొందుండి
వేగమె దానము బొందుండి ||జే జయం||
5. జయజయ శబ్దము జేయుచు ప్రభునకు జయమని పాడుండి వేగమె
జయమని పాడుండి జయజయ మంచును జయ శబ్ధముతో జయముల
నొందుండి వేగమె జయముల నొందుండి ||జే జయం||
Yaesunaadhuni yoadhulandharu | యేసునాధుని యోధులందరు | Andhra Kraisthava Keerthanalu Song number 117 | ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాట నెంబర్ - 117
Songs List
ANdhra Kraisthava Keerthanalu
1 - 100
1. Anni kalabula nunna
2. Deva naa deva
3. adhukonumayya
Manufacturing
Our products are manufactured both locally and globally. We carefully select our manufacturing partners to ensure our products are high quality and a fair value.
0 comments