వినరె మనుజులార క్రీస్తుఁ డిలనుఁ జేయు ఘనములైన పనులలోనఁ
జిత్రమొక్క పని వచించెద ||వినరె||
1. మన మనంబు లలరుచుండ దినదినంబు ప్రభుని నిండు ఘన
మహాద్భుతములు వినినఁ దనివిఁ దీరదు ||వినరె||
2. ఇలను బేతనియపురంబు గలదు మరియ మార్తలక్క సెలియలందు
వాసముండి రెలమితోడను ||వినరె||
3. పరిమళంపు తైలమేసు చరణములకుఁ బూసిన యీ మరియ సోదరుండు
రోగ భరితుఁడయ్యెను ||వినరె||
4. వ్యాధిచేత లాజరుండు బాధనొందుచుండఁ గ్రీస్తు నాధుఁ బిలువనంపి
రపుడు నాతు లిరువురు ||వినరె||
5. తమ్ము డక్క సెలియలును బ్రి యమ్ము తనకుఁ గలిగియుండ నమ్మహాత్ముఁ
డైన క్రీస్తుఁ డరిగె నచటికి ||వినరె||
6. యేసువచ్చు టెఱిగి మార్త యెదురు గానుఁ బోయి తనదు దోసిలొగ్గి
మ్రొక్కి ప్రభువు తోడ బల్కెను ||వినరె||
7. కర్త నీకు దేవుఁడిచ్చు ఘనబలమెఱుగుదును సత్య వర్తి విచట లేని
కతన వ్రాలె లాజరు ||వినరె||
8. పిదప మరియవచ్చి క్రీస్తు పదయుగమున కొరిగి యేడ్చి మొదట
మార్త పలికినట్లు సుదతి పలికెను ||వినరె||
9. అపుడు కర్త వారిపలుకు లాలకించి మదిని మూల్గి కృపకుఁ బాత్రు
రాలితోడ నపుడు నడిచెను ||వినరె||
10. నడిచి లాజరుని సమాధి కడకుఁ జేరి గుహను మూయఁ బడిన రాయి
తీయుఁడనుచుఁ ప్రభువు చెప్పెను ||వినరె||
11. యేసుతోడ మార్తపలికె నీ సమాధినునిచి నాల్గు వాసరంబులయ్యెఁ
గంపు పట్టి యుండదా ||వినరె||
12. దాని నమ్మి చూడుమని మ హానుభావుఁ డాత్మబలము నూని
తండ్రికిపుడు స్తోత్ర మొనరఁజేసెను ||వినరె||
13. లాజరు సమాధినెడలి రమ్ము లెమ్మటంచు లోక పూజితుఁడు మహా
రవంబుఁ బూని పల్కెను ||వినరె||
14. మరణమైనవాఁడు ప్రాణ భరితుఁడగుచు లేచి వచ్చెఁ తరుణులధిక
హర్షలైరి పెదజనంబుతో ||వినరె||
15. కన వినంగ రాని యిట్టి ఘన మహాద్భుతంబుఁ జూచి జనులు క్రీస్తు
యేసునాధు ననుసరించిరి ||వినరె||
16. కనుక మనము వానిఁ జేరు కొని సుఖంబుఁ బడయవచ్చు మనసు
నిలిపి యతనియందు మనుట మేలగున్ ||వినరె||
lanu chaeyu ghanamu laina = panula loana chithra
mokka – pani vachinchedha
Vinarae manuju laara
1. mana manambu lalaru chunda – dhinadhinambu prabhuni
nindu = ghana mahaadhbhu thamulu vinina – thanivi thiiradhu
Vinarae manuju laara
2. eilanu baethaniya purambu – kaladhu mariya maartha
lakka = cheliyalandhu vaasamundi relami thoadanu
Vinarae manuju laara
3. parimalampu thailamaesu – charanamulaku puusina eii =
mariya soadharundu roaga – bharithudayyenu
Vinarae manuju laara
4. vyaadhi chaetha laazarundu – baadha nondhu chunda kriisthu =
naadhu piluva nampi rapudu – naathu liruvuru
Vinarae manuju laara
5. thammu dakka cheliyalunu pri – yammu thanaku kaligi
yunda = ammahaathmudaina kriisthu darige nachatiki
Vinarae manuju laara
6. yaesu vachchu terigi maartha – yedhuru gaanu
thanadhu = dhoasi loggi mrokki prabhuvu – thoada palkenu
Vinarae manuju laara
7. kartha niiku dhaevu dichchu – ghana bala merugudhunu
sathya varthi vichata laeni kiathana – vraale laazaru
Vinarae manuju laara
8. pidhapa mariya vachchi kriisthu – padha yugamuna
korigi yaedchi = modhata maartha paliki natulu – sudhathi palikenu
Vinarae manuju laara
9. apudu kartha vaari palukul – aalakinchi madhini muulgi =
krupaku paathru raali thoada – apudu nadachenu
Vinarae manuju laara
10. nadichi laajaruni samaadhi – kadaku jaeri guhanu muuya =
badina raayi thiiyu danuchu ptrabhuvu cheppenu
Vinarae manuju laara
11 yaesu thoada maartha palike eii samaadhi nunchi naalgu =
vaasarambu layye kampu – patti yundadhaa
Vinarae manuju laara
12. dhaani nammi chuudu mani ma – haanubhaavu
daathma balamu = nuuni thandri kapudu sthoathra monara jaesenu
Vinarae manuju laara
13. laazaru samaadhi nedali – rammu lemmatanchu loaka =
puujithudu mahaa ravambu puuni palkenu Vinarae manuju laara
14. marana maina vaadu praana – bharithudaguchu
laechi vachche – tharunu ladhika harshalairi – pedha janambuthoa
Vinarae manuju laara
15. kana vinanga raani yitti – ghana mahaadhbhuthambu
chuuchi = janulu kriisthu yaesu naadhu – nanusarinchiri
Vinarae manuju laara
16. kanuka manamu vaani jaeru – koni sukhambu badaya
vachchu = manasu nilipi athani yandhu –manuta maelagun
Vinarae manuju laara
Purushoatham Chowdhary
0 comments