Devuni Prema Idigo – Janulaara | దేవుని ప్రేమ ఇదిగో – జనులార | Andhra Kraisthava Keerthanalu Song number 149 | ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాట నెంబర్ - 149
దేవుని ప్రేమ ఇదిగో – జనులార – భావంబునం దెలియరే
కేవలము నమ్ముకొనిన – పరలోక – జీవంబు మనకబ్బును         ||దేవుని||

 

సర్వలోకము మనలను – తన వాక్య – సత్యంబుతో జేసెను
సర్వోపకారుడుండే – మన మీద – జాలిపరుడై యుండెను         ||దేవుని||

మానవుల రక్షింపను – దేవుండు – తన కుమారుని బంపెను
మన శరీరము దాల్చెను – ఆ ప్రభువు – మన పాపమునకు దూరుడే         ||దేవుని||

యేసు క్రీస్తను పేరున – రక్షకుడు – వెలసి నాడిలలోపల
దోసకారి జనులతో – నెంతో సు – భాషలను బల్కినాడు         ||దేవుని||

పాప భారంబు తోడ – నే ప్రొద్దు – ప్రయాసముల బొందెడి
పాపులందరు నమ్మిన – విశ్రాంతి – పరిపూర్ణమిత్తు ననెను         ||దేవుని||

సతులైన పురుషులైనన్ – యా కర్త – సర్వ జనుల యెడలను
సత్ప్రేమగా నడిచెను – పరలోక – సద్బోధలిక జేసెను         ||దేవుని||

చావు నొందిన కొందరిన్ – యేసుండు – చక్కగా బ్రతికించెను
సకల వ్యాధుల రోగులు – ప్రభు నంటి – స్వస్థంబు తా మొందిరి         ||దేవుని||

గాలి సంద్రపు పొంగులన్ – సద్దణిపి – నీళ్లపై నడచినాడే
మేలు గల యద్భుతములు – ఈలాగు – వేల కొలదిగ జేసెను         ||దేవుని||

చేతుల కాళ్లలోను – రా రాజు – చేర మేకులు బొందెను
పాతకులు గొట్టినారే – పరిశుద్ధ – నీతి తా మోర్వలేకన్         ||దేవుని||

ఒడలు రక్తము గారగ – దెబ్బలు – చెడుగు లందరు గొట్టిరి
వడిముళ్లు తల మీదను – బెట్టిరి – ఓర్చెనో రక్షకుండు         ||దేవుని||

ఇన్ని బాధలు బెట్టుచు – దను జంపు – చున్న పాప నరులను
మన్నించు మని తండ్రిని – యేసుండు – సన్నుతితో వేడెను         ||దేవుని||

రక్షకుడు శ్రమ బొందగా – దేశంబు – తక్షణము చీకటయ్యెన్
రక్షకుడు మృతి నొందగ – తెర చినిగి – రాతి కొండలు పగిలెను         ||దేవుని||

రాతి సమాధిలోను – రక్షకుని – నీతిగల దేహంబును
పాతి పెట్టిరి భక్తులు – నమ్మిన – నాతు లందరు జూడగా         ||దేవుని||

మూడవ దినమందున – యేసుండు – మృతి గెల్చి లేచినాడు
నాడు నమ్మిన మనుజులు – చూచిరి – నలువది దినములందున్         ||దేవుని||

పదునొకండు మారులు – వారలకు – బ్రత్యక్షు డాయె నేసు
పరలోకమున కేగెను – తన వార్త – బ్రకటించు మని పల్కెను         ||దేవుని||

నమ్మి బాప్తిస్మమొందు – నరులకు – రక్షణ మరి కల్గును
నమ్మ నొల్లక పోయెడు – నరులకు – నరకంబు సిద్ధమనెను         ||దేవుని||

 

Devuni Prema Idigo – Janulaara – Bhaavambunam Deliyare
Kevalamu Nammukonina – Paraloka – Jeevambu Manakabbunu      ||Devuni||

 

Sarvalokamu Manalanu – Thana Vaakya – Sathyambutho Jesenu
Sarvopakaarudunde – Mana Meeda – Jaaliparudai Yundenu      ||Devuni||

Maanavula Rakshimpanu – Devundu – Thana Kumaaruni Bampenu
Mana Shareeramu Daalchenu – Aa Prabhuvu – Mana Paapamunaku Doorude      ||Devuni||

Yesu Kreesthanu Peruna – Rakshakudu – Velasi Naadilalopala
Dosakaari Janulatho – Nentho -Su Bhaashalanu Balkinaadu      ||Devuni||

Paapa Bhaarambu Thoda – Ne Proddu – Prayaasamula Bondedi
Paapulandaru Nammina – Vishraanthi – Paripoornamitthu Nanenu      ||Devuni||

Sathulaina Purushulainan – Yaa Kartha – Sarva Janula Yedalanu
Sathpremaga Nadichenu – Paraloka – Sadhbodhalika Jesenu      ||Devuni||

Chaavu Nondina Kondarin – Yesundu – Chakkagaa Brathikinchenu
Sakala Vyaadhula Rogulu – Prabhu Nanti – Swasthambu Thaa Mondiri      ||Devuni||

Gaali Sandrapu Pongulan – Saddanipi – Neellapai Nadachinaade
Melu Gala Yadbhuthamulu – Eelaagu – Vela Koladiga Jesenu      ||Devuni||

Chethula Kaallalonu – Raa Raaju – Chera Mekulu Bondenu
Paathakulu Gottinaare – Parishuddha – Neethi Thaa Morvalekan      ||Devuni||

Odulu Rakthamu Gaaraga – Debbalu – Chedugu Landaru Gottiri
Vadimullu Thala Meedanu – Bettiri – Orcheno Rakshakundu      ||Devuni||

Inni Baadhalu Bettuchu – Danu Jampu – Chunna Paapa Narulanu
Manninchu Mani Thandrini – Yesundu – Sannuthitho Vedenu      ||Devuni||

Rakshakudu Shrama Bondagaa – Deshambu – Thakshanamu Cheekatayyen
Rakshakudu Mruthi Nondaga – Thera Chinigi – Raathi Kondalu Pagilenu      ||Devuni||

Raathi Samaadhilonu – Rakshakuni – Neethigala Dehambunu
Paathi Pettiri Bhakthulu – Nammina – Naathu Landaru Joodagaa      ||Devuni||

Moodava Dinamanduna – Yesundu – Mruthi Gelchi Lechinaadu
Naadu Nammina Manujulu – Choochiri – Naluvadi Dinamulandun      ||Devuni||

Padunokandu Maarulu – Vaaralaku – Brathyakshu Daaye Nesu
Paralokamuna Kegenu – Thana Vaartha – Brakatinchu Mani Palkenu      ||Devuni||

Nammi Baapthismamondu – Narulaku – Rakshana Mari Kalgunu
Namma Nollaka Poyedu – Narulaku – Narakambu Siddhamanenu      ||Devuni||

Songs List

ANdhra Kraisthava Keerthanalu

1 - 100
1. Anni kalabula nunna
2. Deva naa deva
3. adhukonumayya

Manufacturing

Our products are manufactured both locally and globally. We carefully select our manufacturing partners to ensure our products are high quality and a fair value.

0 comments

Leave a comment