Anni kalambula nunna yehova - అన్ని కాలంబుల నున్న యెహోవా

అన్ని కాలంబుల నున్న యెహోవా నినెన్నఁదరంబయో కన్న తండ్రి వన్నె కెక్కిన మోక్ష వాసాళి సన్నుతు లున్నతమై యుండ మున్నె నీకు
                                                                                                                          ||అన్ని||

  1. నిన్నుఁ బ్రకటన సేయ నిఖిల లోకములను బన్నుగఁ జేసిన బలుఁడ వీవె ఉన్న లోకంబుల -నుడుగక కరుణా సం-పన్నతతో నేలు ప్రభుఁడ వీవె అన్ని జీవుల నెఱిఁగి యాహార మిచ్చుచు నున్న సర్వజ్ఞుం డవు నీవే ఎన్న శక్యముగాక ఉన్న లక్షణముల సన్నుతించుటకు నేఁ జాలుదునా                                         ||అన్ని||
  2. పుట్టింప నీవంచుఁ బోషింప నీవంచుఁ గిట్టింప నీవంచు గీర్తింతును నట్టి పనికి మాలి నట్టి మానవుల చే పట్టి రక్షింపం బాధ్యుండ వంచు దట్టమైన కృపను దరిఁజేర్చ నాకిచ్చి పట్టయి నిలచియుండు ప్రభుఁడ వంచుఁ గట్టడచేఁ గడ ముట్టుదనుక నా పట్టుకొలఁది నిన్నుఁ బ్రస్తు తింతు                                  ||అన్ని||
  3. కారుణ్యనిధి వీవు కఠినాత్ముఁడను నేను భూరి శుద్ధుఁడ వీవు పాపి నేను సార భాగ్యుడ వీవు జగతిలో నాకన్న దారిద్రుఁడే లేఁడు తరచి చూడ సార సద్గుణముల సంపన్నుఁడవు నీవు ఘోర దుర్గుణ సంచారి, నేను ఏ రీతి స్తుతియింతు నే రీతి సేవింతు నేర మెన్నక ప్రోవ నెర నమ్మితి                                                  ||అన్ని||

అన్ని కాలంబుల నున్న యెహోవా నినెన్నఁదరంబయో కన్న తండ్రి వన్నె కెక్కిన మోక్ష వాసాళి సన్నుతు లున్నతమై యుండ మున్నె నీకు

English Translation

O Lord, who exists in all times and seasons, You are the Father greater than any earthly father. You are the dwelling place of salvation, eternally perfect and complete. You are present with me always.

  1. Your Omnipotence and Compassion

    You are the One who created all the worlds with Your mighty power. In this world filled with countless beings, You sustain all life with Your boundless mercy and compassion. You are the All-Knowing One who provides food and sustenance to every living creature. Your qualities and attributes are beyond measure, and I am unable to fully comprehend them.

  2. Your Role in Our Lives

    You are the One who gives birth, sustains life, and receives our praise. You are worthy of all worship and devotion. You have placed upon Yourself the responsibility to protect humanity. You have bestowed upon me Your dense and abundant grace, and You stand firm in Your commitment to me. As I hold onto You, O Lord, I sing Your praises with all my heart.

  3. The Contrast Between You and Me

    You are the treasure house of compassion; I am hard-hearted. You are supremely pure; I am a sinner. You are blessed with fortune; I am the poorest in this world. You are adorned with countless virtues; I am engrossed in terrible vices. How can I praise You? How can I serve You? Yet, I believe that You will guide me and show me the way.

0 comments

Leave a comment